India and West Indies are set for a decisive Super-8 clash in T20 World Cup 2026 on Sunday, with a semifinal berth at stake.

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఆదివారం కీలక పోరు జరగనుండగా, సెమీ ఫైనల్ అవకాశాల కోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. India and West Indies are set for a decisive Super-8 clash in T20 World Cup 2026 on Sunday, with a semifinal berth at stake.
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ (IND vs WI) జట్లు ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేత నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకోనుంది. దాంతో ఈ పోరు ఇరు జట్లకు కూడా అత్యంత కీలకంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతుండగా, షాయ్ హోప్ వెస్టిండీస్ జట్టును నడిపిస్తున్నాడు. గ్రూప్ దశలో నిలకడైన ప్రదర్శన చేసిన ఇరు జట్లు సూపర్-8లో తమ స్థాయిని మరింత నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయ.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు భారత్, వెస్టిండీస్ జట్లు 30 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తంగా చూసుకుంటే టీ20ల్లో విండీస్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది.
అయితే టీ20 ప్రపంచకప్ చరిత్రలో పరిస్థితి భిన్నంగా ఉంది. పొట్టి ప్రపంచకప్‌లలో ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా, మూడు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ విజయం సాధించింది. భారత్ కేవలం ఒకసారి మాత్రమే గెలిచింది. ప్రపంచకప్ వేదికపై విండీస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
స్కోర్ల పరంగా చూస్తే, వెస్టిండీస్‌పై భారత్ అత్యధికంగా 192 పరుగులు నమోదు చేయగా, అత్యల్ప స్కోరు 130గా ఉంది. మరోవైపు భారత్‌పై వెస్టిండీస్ అత్యధికంగా 196 పరుగులు సాధించగా, కనిష్ట స్కోరు 129గా ఉంది.
మొత్తంగా టీ20ల్లో భారత్‌కు మెరుగైన హెడ్-టు-హెడ్ రికార్డు ఉన్నప్పటికీ, ప్రపంచకప్ మ్యాచ్‌లలో వెస్టిండీస్ పైచేయి సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
India and West Indies are set for a high-stakes Super 8 clash in the T20 World Cup 2026 on Sunday, with a semifinal berth on the line.
As part of the T20 World Cup 2026 Super 8 stage, India will face West Indies at Eden Gardens in Kolkata. The winner of this crucial encounter will directly qualify for the semifinals, making it a must-win game for both sides.
India will take the field under the leadership of Suryakumar Yadav, while West Indies will be led by Shai Hope. Both teams have shown competitive form in the tournament so far and will look to deliver a strong performance in this knockout-like contest.
In overall T20 Internationals, India and West Indies have faced each other 30 times. India holds the advantage with 19 wins, while West Indies has won 10 matches. One match ended without a result. Statistically, India has had the upper hand in bilateral T20 contests.
However, the record shifts when it comes to T20 World Cups. The two teams have met four times in the tournament’s history. West Indies has won three of those matches, while India has managed just one victory. This gives the Caribbean side a clear edge in global events.
Looking at scoring patterns, India’s highest total against West Indies in T20Is is 192, while their lowest is 130. On the other hand, West Indies’ highest total against India stands at 196, with their lowest being 129.
While India enjoys a stronger overall head-to-head record in T20 cricket, West Indies has historically performed better in T20 World Cup encounters. With a semifinal spot at stake, Sunday’s clash promises to be an intense and closely fought battle.