నేడు ఆయన వర్ధంతి బిర్సా ముండా ఇతడు ముండా జాతికి చెందిన జానపద నాయకుడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, రaార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా.బిర్సా ముండా 1875 నవంబరు 15 ఉలిహట్, రాంచీ, జన్మించారు.1900 9జూన్ రాంచీ జైలు లో మరణించారు. బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనది.బిర్సా ముండా, నవంబర్ 15, 1875, గురువారం రోజున జన్మించాడు. అప్పట్లో ఆచరణలో ఉన్న ముండా ప్రజల ఆచారం ప్రకారం ఆయన పుట్టిన రోజును బట్టి పేరు పెట్టారు. జానపద గేయాలలో కూడా ఈయన జన్మస్థలం ఉలిహటు లేదా చల్కడ్ అన్న అయోమయం నెలకొన్నది. బిర్సా తండ్రి సుగణ ముండా జన్మస్థలం ఉలిహటు. ఉలిహటులో బిర్సా అన్న కొమ్టా ముండా నివసించి ఉండటం వల్ల, ఆయన ఇల్లు ఇంకా అక్కడ శిథిలావస్థలో ఉండటం వల్ల, ఈయన ఉలిహటులో జన్మించాడన్న వాదన ఉంది.బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు, మరియు అతని తమ్ముడు, పస్నా ముండా, ఉలిహటును వదిలి కూలిపని కోసం బీర్బంకీ వద్ద ఉన్న కురుంబ్దాలో స్థిరపడ్డారు. కురుంబ్దాలో, బిర్సా అన్న కొమ్టా, మరియు అక్క దస్కిర్ పుట్టారు. అక్కడి నుండి బంబాకు తరలి వెళ్ళింది. అక్కడే బిర్సా అక్క చంపా మరియు బిర్సా పుట్టారు.బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు దీనికి పెట్టడం జరిగింది.