భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా 7 శిఖరాలెక్కిన హైదరాబాద్ బాలుడు విశ్వనాథ్ కార్తికేయ!

ఆఖరిగా అతను అధిరోహించిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీటర్లు). ఈ ఘనత అతని సంవత్సరాల శ్రమ, కృషి, శారీరక మరియు మానసిక ధైర్యానికి గుర్తింపు. అతను అధిరోహించిన 7 శిఖరాల జాబితా ఈ విధంగా ఉంది:

హైదరాబాద్‌కు చెందిన 16ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ పదకంటి ప్రపంచ ప్రసిద్ధ 7 సమ్మిట్స్ (ఏడు ఖండాల అత్యున్నత శిఖరాలు) విజయవంతంగా అధిరోహించి భారతదేశంలోనే అత్యంత యువ పర్వతారోహకుడిగా, ప్రపంచంలో రెండవ పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

ఆఖరిగా ఆయన ఎక్కిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ).
ఇతర శిఖరాలు: డెనాలి (ఉ.అమెరికా), అకోంకగ్వా (ద.అమెరికా), ఎల్బ్రస్ (యూరోప్), కిలిమంజారో (ఆఫ్రికా), విన్సన్ (అంటార్కటికా), కొసియోజ్కో (ఆస్ట్రేలియా).

ఈ ఘనత వెనుక తల్లిదండ్రుల మద్దతు, మెంటార్లు భరత్ & లెఫ్ట్. రోమిల్ బర్త్వాల్ మార్గదర్శనం కీలకం.
“ఈ విజయానికి ప్రతి క్షణం శ్రమతో కూడినదే… కానీ కల నెరవేరింది,” అంటున్నాడు విశ్వనాథ్.

భారత పర్వతారోహణ చరిత్రలో ఇది గర్వించదగిన క్షణం!
“కలలు కన్నవారు కష్టపడితే శిఖరాలే ముందుంటాయి!”

  • ఏషియా – మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ / 29,029 అడుగులు)
  • దక్షిణ అమెరికా – అకోంకగ్వా (6,961 మీ / 22,838 అడుగులు)
  • ఉత్తర అమెరికా – డెనాలి (6,190 మీ / 20,310 అడుగులు)
  • ఆఫ్రికా – కిలిమంజారో (5,895 మీ / 19,341 అడుగులు)
  • యూరోప్ – మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీ / 18,510 అడుగులు)
  • అంటార్కటికా – మౌంట్ విన్సన్ (4,892 మీ / 16,050 అడుగులు)
  • ఆస్ట్రేలియా – మౌంట్ కొసియోజ్కో (2,228 మీ / 7,310 అడుగులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *