భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో ఏటా అధికార యంత్రాంగంలో కొందరి సమన్వయ లోపం అనేక సమస్యలకు కారణమవుతోంది.


భద్రాచలం : సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో ఏటా అధికార యంత్రాంగంలో కొందరి సమన్వయ లోపం అనేక సమస్యలకు కారణమవుతోంది. కొంతమంది అధికారులు, ఉద్యోగుల తీరుతో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు వీఐపీల సేవల్లో తరిస్తుండగా మరికొందరు శ్రీరామనవమి రోజున తమ సొంతవారికే ప్రాధాన్యమిస్తూ డబ్బులు పెట్టి టిక్కెట్లు కొన్న భక్తులను మాత్రం గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో ఈ ఏడాది భక్తులకు కనీస మౌళిక వసతులు అందుతాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ఏడు భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల నిర్వహణపై సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో భద్రాచలంలో ఏటా భక్తులు ఎదుర్కొనే సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ఇదీ..- భద్రాచలం
అడుగుపెట్టగానే సమస్యల స్వాగతం..శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రికి వచ్చే భక్తులకు భద్రాచలంలో అడుగుపెట్టగానే సమస్యలు స్వాగతం పలుకుతాయి. నవమి రోజున భద్రాచలంలో ట్రాఫిక్‌ నియంత్రణ ఏటా ఒక సవాల్‌గా మారుతోంది. ముఖ్యంగా ఆ రోజు ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గోదావరి వారధిపై వాహనాల రాకపోకలను నియంత్రించే ందుకు ప్రత్యేక చర్యలేమీ చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. స్వామివారి కల్యాణం ముగిసిన తరువాత పోలీసు లు తమ బాధ్యత అయిపోయిందని భావిస్తుండడంతో ఈ విషయంలో ప్రతిసారి పోలీసు శాఖ విమర్శల పాలవుతోంది. ఇక స్వామివారి కల్యాణం రోజున భక్తులకు పూర్తిస్థాయిలో వసతి సౌకర్యాల కల్పన అందని దాక్షాలా మారుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీసం మండుతున్న ఎండలనుంచి సేద తీరేందుకు సరైన నీడ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారికి చెట్ల నీడే దిక్కవుతోంది. ఇక భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో తాగునీరు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థానమే నిర్వహించేది. కానీ ఈసారి ఆ విషయాన్ని విస్మరించడం పట్ల దేవస్థానం ఉద్యోగ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక గోదావరిలో భక్తులు స్నానం చేసే సమయంలో ప్రమాద హెచ్చరికబోర్డులతో పాటు ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లతో పర్యవేక్షించాల్సి ఉంటుంది. సెక్టార్లలో తప్పని తోపులాటలు మిథిలాస్టేడియంలో స్వామివారి కల్యాణం ముగిసిన తరువాత భక్తులు సెక్టార్ల నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసు అధికారులు జాడ కనిపించకపోవడంతో తోపులాటలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం ఎవరికి వారు ముందుగా వెళ్లాలనే ఆతృతలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇక కల్యాణం అనంతరం భక్తులకు తలంబ్రాల పంపిణీ సమయంలోనూ కౌంటర్ల వద్ద తోపులా టలు జరిగి స్వామివారి తలంబ్రాలు నేలపాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. విధి నిర్వహణ ఇలా అయితే ఎలా ?శ్రీరామ నవమిరోజు కొందరు పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. కొందరు కీలక ప్రభుత్వ శాఖల అధికారులు స్వామివారి కల్యాణం జరిగే మిథిలాస్టేడియంలోని సెక్టార్లలోకి తమ కుటుంబ సభ్యులను, బంధువులను పంపిస్తుండడంతో ఆయా సెక్టార్లకు టికెట్‌ కొని వచ్చే భక్తులకు అవకాశం దక్కడం లేదు. అనేకమంది భక్తులు టికెట్లు కొని కూడా సెక్టార్లలోకి వెళ్లలేక బయటే ఉండి పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విషయంపై భక్తుల నుంచి ఏటా తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నా ఆయా అధికారు ల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇక కొందరు అధికారులు స్వామి వారి కల్యాణం జరుగుతున్న సమయంలో విధినిర్వహణను పక్కన పెట్టిన తమ ఫోన్లలో స్వామివారి కల్యాణాన్ని చిత్రీకరించడం విమర్శలకు తావిస్తోంది. కల్యాణం అనంతరం స్వామివారి ముత్యాల తలంబ్రాల కోసం గతంలో కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారు లు పోటీలు పడి సామాన్యుల భక్తులకు ఇబ్బందులు కలిగించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక కల్యాణ క్రతువుకోసం స్వామివారిని మిథిలా స్టేడియానికి తీసుకొచ్చే సమయంలో స్వామివారిని తాకేందుకు భక్తులు పోటీ పడుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో అర్చకులు, వైదిక సిబ్బంది అసహనానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు స్వామి వారితో పాటు వచ్చే దేవస్థానం సిబ్బంది, అర్చకులను సైతం అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమిం చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.నవమి సమీక్షకు నిర్దిష్ట కార్యాచరణతో రావాలి భద్రాద్రి డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి భద్రా చలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం శ్రీరామనవమి వేడుకలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిర్వహించే సమీక్షా సమావేశానికి అధికారులు నిర్దిష్టమైన కార్యాచరణ, ప్రణాళికల తో హజరుకావాలని భద్రాద్రి జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌చక్రవర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నవమి సమీక్ష సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్టు తెలిపారు. ఎవరైనా దరఖాస్తులు ఇవ్వదలచినవారు కలెక్టరేట్‌లోని ఇనవార్డులో ఇవ్వాలని సూచించారు. టికెట్ల విక్రయ కేంద్రాల ఏర్పాటు, ఆన్‌లైన్‌లో గదుల బుకింగ్‌నవమి మహోత్సవాల టికెట్లు సోమవారం నుంచి తానీషా కల్యాణ మండపం, ఆలయ రాజగోపురం మెయిన టికెట్‌ కౌంటర్‌, బ్రిడ్జి పాయింట్‌ వద్ద, ఎస్‌బీఐ భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో విక్రయిస్టున్నట్లు ఇనచార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాల మేరకు రూ.2,500నుంచి ఆపై విలువ గల టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అలాగే నవమి సందర్భంగా భద్రాచలానికి వచ్చే భక్తులు ఆనలైన ద్వారా లాడ్జ్‌లలో రూములు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. నుంచి ద్వారా గదుఘధ/లను బెక్‌ చేసుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *