Bhadrachalam Sri Ramanavami 2026: Sitarama Kalyanam Tickets Available Online

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
Tickets for the Sitarama Kalyanam and Pattabhishekam celebrations at the Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple during Sri Ramanavami Brahmotsavams are now available online through the official temple website.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరాల కంటే మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27వ తేదీన సీతారాముల కల్యాణోత్సవం, 28వ తేదీన పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేశారు.
కళ్యాణోత్సవం వీక్షణకు వివిధ ధరలతో టికెట్లు అందుబాటులో ఉంచారు. రూ.7,500 టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 ధరలతో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
28వ తేదీన జరిగే పట్టాభిషేక మహోత్సవం కోసం ఒక్కొక్కరికి రూ.1,500, రూ.500, రూ.100 ధరల టికెట్లు విక్రయిస్తున్నారు. భక్తులు ఈ టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు తనీషా కల్యాణ మండపంలోని సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి అసలు టికెట్లు పొందాల్సి ఉంటుంది.
భద్రాచలానికి రాలేని భక్తుల కోసం పరోక్షంగా గోత్రనామాలతో కల్యాణం నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఇందుకోసం రూ.5,000 మరియు రూ.1,116 ధరల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఈనెల 15వ తేదీ నుంచి భద్రాచలం ఆలయం వద్ద, తనీషా కల్యాణ మండపం, బ్రిడ్జ్ పాయింట్ సీఆర్వో కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా టికెట్లు విక్రయిస్తున్నారు.
సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా గత ఏడాది సుమారు నాలుగు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు విక్రయించగా, ఈ ఏడాది ఐదు లక్షల వరకు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా భక్తులకు అందించేందుకు సుమారు రెండు లక్షల చిన్న లడ్డూలు, రూ.100 విలువైన 400 గ్రాముల మహా లడ్డూలు మూడు వేలకుపైగా సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 27న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం. 28న జరిగే శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమానికి సంప్రదాయం ప్రకారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆలయ అధికారులు ఆహ్వానించనున్నారు.
Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple, one of the most prominent pilgrimage centres in Telangana often referred to as the “Dakshina Ayodhya,” is preparing for the grand Sri Ramanavami Brahmotsavams. The celebrations will be held from March 19 to April 2 with elaborate arrangements by the temple administration and the Endowments Department.
As part of the festivities, the Sitarama Kalyanam will take place on March 27, followed by the Pattabhishekam ceremony on March 28. Special seating sectors have been arranged around the temple premises for devotees to witness the events.
Tickets for the Kalyanam event are available in multiple categories. A ₹7,500 ticket allows entry for two persons, while other ticket categories include ₹2,500, ₹2,000, ₹1,000, ₹300 and ₹150.
For the Pattabhishekam ceremony on March 28, tickets are priced at ₹1,500, ₹500 and ₹100 per person. Devotees can book these tickets online through the official temple website.
Those who book tickets online must collect the original passes from the CRO office at Tanishaa Kalyana Mandapam between March 20 and 6 AM on March 27.
Devotees unable to travel to Bhadrachalam can also participate symbolically in the Kalyanam by registering their gotra names. Tickets priced at ₹5,000 and ₹1,116 are available online for this purpose.
Offline ticket counters have also been set up at the temple premises, Tanishaa Kalyana Mandapam, Bridge Point CRO office and the Sub-Collector office from March 15.
Temple authorities said that last year around four lakh packets of “Mutyala Talambraalu” were sold during the festival. This year, preparations are underway to produce at least five lakh packets. Nearly two lakh small laddus and more than three thousand “Maha Laddus” weighing 400 grams each (priced at ₹100) will also be made available for devotees.
Chief Minister Revanth Reddy is expected to attend the Sri Ramanavami celebrations on March 27, while Governor Shiv Pratap Shukla is likely to be invited for the Pattabhishekam ceremony on March 28 as per tradition.