Bhadrachalam Sitarama Talambralu Booking Poster Unveiled at Hakimpet RTC Depot

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట :భద్రాచల సీతారామచంద్రస్వామి తలంబ్రాల బుకింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను హకీంపేట ఆర్టీసీ డిపోలో ఆవిష్కరించారు. తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఏర్పాటు చేసిన ప్రతినిధిని సంప్రదించాలని డిపో మేనేజర్ సరితా దేవి సూచించారు.
శామీర్‌పేట, మార్చి 9 (ప్రజా మలుపు): శామీర్‌పేట మండలం హకీంపేట ఆర్టీసీ డిపోలో సోమవారం భద్రాచల సీతారామచంద్రస్వామి తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సరితా దేవి పోస్టర్‌ను విడుదల చేసి భక్తులకు వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాచల సీతారామచంద్రస్వామి తలంబ్రాలు కావాలనుకునే భక్తులు డిపోలో ఏర్పాటు చేసిన ప్రతినిధిని సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎఫ్ రామ్మోహన్, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, ఏడీసీ వెంకటేష్, సూపర్వైజర్ శంకర్, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాలరాజు, అనిల్, రాజగోపాల్, డిపో మార్కెటింగ్ జేఎస్ రెడ్డి, గోపు శ్రీనివాస్, రమేష్ నాయక్, డిపో ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
A poster announcing the booking of sacred talambralu of Bhadrachalam Sri Sitarama Chandra Swamy was unveiled at Hakimpet RTC Depot in Shamirpet mandal. Depot Manager Saritha Devi advised devotees to contact the appointed representative for bookings.
Shamirpet, March 9 (Praja Malupu): The poster for booking the sacred talambralu of Bhadrachalam Sri Sitarama Chandra Swamy was unveiled on Monday at Hakimpet RTC Depot in Shamirpet mandal. Depot Manager Saritha Devi released the poster and explained the booking process to devotees.
Speaking on the occasion, she said devotees who require the sacred talambralu can contact the representative appointed at the depot for booking. The arrangements have been made to ensure convenience for devotees seeking the offering.
MF Rammohan, Vigilance Head Constable Sudarshan, ADC Venkatesh, Supervisor Shankar, Regional Marketing Executive Balaraju, Anil, Rajagopal, Depot Marketing JS Reddy, Gopu Srinivas, Ramesh Naik, depot employees and staff members participated in the programme.