బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ విడుదల – ఆగస్టు 8న థియేటర్లలోకిBeautiful heroines launch ‘Raju Gani Savaal’ trailer – movie hits theatres on August 8

బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ విడుదల – ఆగస్టు 8న థియేటర్లలోకి
Beautiful heroines launch ‘Raju Gani Savaal’ trailer – movie hits theatres on August 8

హైదరాబాద్‌లో ‘రాజు గాని సవాల్’ సినిమా ట్రైలర్ వేడుక వైభవంగా జరిగింది. హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కాగా, సినిమా ఆగస్టు 8న థియేటర్లలోకి రానుంది. దర్శక నిర్మాత హీరోగా లెలిజాల రవీందర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మధ్యతరగతి కుటుంబాల్లోని భావోద్వేగాలు, సవాళ్ల నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

‘ఎల్ ఆర్ ప్రొడక్షన్‌’ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి బాపిరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ బాధ్యతలు తీసుకున్నారు. డింపుల్ హయతి మాట్లాడుతూ, “ఇది నాకు ప్రత్యేకంగా నచ్చిన టీమ్, మంచి కంటెంట్ ఉన్న సినిమా,” అని తెలిపారు. రాశీ సింగ్, సంధ్య, రితికా చక్రవర్తి, భద్రం, రవీందర్ బొమ్మకంటి తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

సినిమా విజయంపై పూర్తి నమ్మకముందని నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. కథ, భావోద్వేగాలు, సంగీతం అన్నీ కలబోసిన ఈ చిత్రం రక్షాబంధన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *