హైదరాబాద్ : గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ‘‘బీ.సి. బంధు పధకం’’ ప్రవేశపెట్టి ఒక్కోక్క కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని, అలాగే ముఖ్యమంత్రి 5కులాలకు ప్రకటించిన లక్ష రూపాయలు పధకాన్ని బీ.సి జాబితాలోని 130 కులాలకు వర్తింపచేయాలని, వారం రోజులలో ఈ పధకాన్ని అమలు చేయాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీ.సి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకార్ తో సచివాలయంలో చర్చలు జరిపారు. 1. బీ.సి బంధు ప్రవేశపెట్టి 10 లక్షల రు!! ఇవ్వాలని,ముక్య మంత్రి ప్రకటించిన లక్ష రు!! బీ.సి. జాబితాలో యున్న 130 కులాలకు మంజూరు చేయాలని, గత ఎన్నికలకు ముందు 201 లతో బీ.సి కార్పొరేషన్ ద్వార తీసుకొని పెండిగులో పెట్టిన 5 లక్షల 47 వేల ధరఖాస్తు ధరులకి వెంటనే రూనలు మంజూరు చేయాలని కోరారు.అలాగే ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసారూ. ఎస్.టి/ఎస్.సి/మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బిసి/ఇబిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ ప్రతినిది వర్గంలో గుజ్జ కృష్ణ, అంజి, వేముల రామకృష్ణ, టి. నందా గోపాల్, నిఖిల్ , రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.