బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భారీగా భక్తుల…. రద్దీ మధ్య ట్రాఫిక్‌ను సైబరాబాద్ పోలీసులు ముందస్తు ప్రణాళికతో సాఫీగా నిర్వహించారు.

Amid heavy rush of devotees to Sri Bhramaramba Mallikarjuna Swamy Temple in Beeranguda on Maha Shivaratri, Cyberabad Police managed traffic smoothly with advance planning.

మహాశివరాత్రి పర్వదినం, ఆదివారం కావడంతో బీరంగూడ గుట్ట వద్ద ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని అమీన్‌పూర్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ I రంజన్ రతన్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈసారి ముందుగానే ప్రణాళిక రూపొందించి పార్కింగ్ స్థలాలను పెంచడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ దేవాలయాన్ని సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు నార్సింగి, బీరంగూడ, కేపీహెచ్‌బీ, ఇస్నాపూర్ ప్రాంతాలను కూడా సందర్శించారు.

మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ టీంలు, షీ టీమ్ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. 50 సీసీ కెమెరాల ద్వారా క్యూలైన్ల పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ కదలికలను గమనించారు. ఎక్కడా వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక బలగాలను మోహరించారు.

రోటేషన్ విధానంలో క్యూలైన్లను క్లియర్ చేస్తూ దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు విజయవంతమయ్యాయని తెలిపారు.

On Maha Shivaratri coinciding with Sunday, a large number of devotees thronged the Sri Bhramaramba Mallikarjuna Swamy Temple at Beeranguda hill. Cyberabad Traffic DCP I Ranjan Ratan Kumar said special traffic arrangements by Aminpur Traffic Police helped ensure smooth movement. Considering last year’s issues, additional parking spaces were arranged and vehicle movement was streamlined.

Cyberabad CP Dr. M. Ramesh visited the temple to review facilities, security arrangements, parking and traffic management. He also inspected bandobast arrangements in Narsingi, Beeranguda, KPHB and Isnapur areas.

Law and order, traffic, crime teams and She Teams worked in coordination to manage the heavy rush. About 50 CCTV cameras monitored queue lines, while drones tracked traffic flow. Special teams were deployed to prevent congestion.

Queue lines were cleared in rotation to ensure smooth darshan. Devotees expressed satisfaction over the arrangements, stating that advance planning helped avoid traffic problems.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *