`
సిలిండర్ పేలి ఒకరు మృతి ఆరుగురికి గాయాలు
ఖమ్మంజిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు దాటికి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంజిలా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంలో ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములు నాయక్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి నేతలంతా వచ్చారు. అగ్ర నేతలు గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు. బాణ సంచా కాల్చినప్పుడు ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. అంతే మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే టైంలో అ నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ధాటికి సవిూపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో స్పాట్‌లోనే ఒకరు చనిపోగా… మరో ఆరురుగు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటి వరకు నేతల రాకతోసందడిగా ఉన్న ప్రాంతం రక్తసిక్తమైపోయింది. చీమలపాడుఆత్మీయ సమావేశం పరిసరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. మృతుడి కుటుంబం, క్షతగాత్రుల ఫ్యామిలీలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. చీమలపాడు ఘటన పట్ల మంత్రి పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపున బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రును ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన తీరును నాయకులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు