బీఆర్‌ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభయ్ కైలాస్.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : కంధార్ లోహా లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ విజయవంతం కావడంతో.. పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ సమక్షంలో ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్ చేరారు. ప్రగతి భవన్‌లో అభయ్ కైలాస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఔరంగాబాద్‌కు చెందిన అభయ్ కైలాస్‌ది రాజకీయ కుటుంబం. అభయ్ కైలాస్ తండ్రి, తాత గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆయన మామ మాజీ ఎమ్మెల్యే కాగా, అత్త మాజీ జడ్పీ ప్రెసిడెంట్. 1998లో ఎన్‌ఎస్‌యూఐ ఔరంగాబాద్ విభాగానికి అభయ్ అధ్యక్షుడిగా పని చేశారు. 2002-07 వరకు ఔరంగాబాద్ జడ్పీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.