బి.జె.పి., వై.సి.పి. పై పోరాటం, ‘‘సి.పి.ఎం. సి.పి.ఐ. ప్రచార బేరి’’ లక్ష్యం బద్వేలు బద్వేల్ లో శనివారం డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం నుండి నాలురోడ్ల కూడలిలోని సి.ఐ.టి.యు. కార్యాలయం వరకు సి.పి.ఎం.
సి.పి.ఐ., బి.జె.పి హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార జాత ర్యాలీ నిర్వహించి, సి.ఐ.టి.యు. కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేడు దేశంలోని బి.జె.పి. ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్. నియంత్రణలో పనిచేస్తుందని, లౌకిక భారతదేశంలోని చట్టాలన్నీ హిందుత్వ చట్టాలుగా మారుస్తోందని వారు అన్నారు. దేశంలోని ముస్లింలపై, క్రిస్టియన్స్ల లపై హిందుత్వ మూకలు గో రక్షణ పేరిట దాడులు చేస్తున్నారని, ప్రజల ఆహారంపై ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ హక్కులను పార్లమెంటులో రద్దు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్ శాఖనే బి.జె.పి. ప్రభుత్వం రద్దు చేస్తున్నదని వారు తెలిపారు. బి.జె.పి. కనుసనల్లోనే రాష్ట్రంలో వై.సి.పి., టి.డి.పి, జనసేన పార్టీలు రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాయని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బి.జె.పి.ని పల్లంతా మాట కూడా అనలేకపోతున్నారని వారు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును దృష్టిలో పెట్టుకొని బిజెపి అనుకూల వైసీపీ వైఖరి మార్చుకోవాలన్నారు.ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరంకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చుపెట్టిన మూడు వేల కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి తేంచుకోలేని, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిరదన్నారు. పేదరిక నిర్మూలన కొరకు ప్రణాళికలు తయారుచేయడానికి, జన గణనతో పాటు, కులగనన కూడా చేయాలని మోడీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ , బీసీ, కుల గణన చేయకుండా దాటవేస్తోందన్నారు. సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి జి.చంద్ర మాట్లాడుతూ … బీ.జే.పీ. ప్రభుత్వం దేశంలో నిరంకుషత్వంగా పరిపాలన సాగిస్తున్నదని, ఆహారంపై నిషేధం పెడుతున్నదని, దేశంలో ఫెడరల్ వ్యవస్థను ప్రక్కన పెట్టి ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే ఆహారం అనే విధానాలు పెడుతుందన్నారు. బి.జె.పి. నీ గద్దదించాల్సిన అవసరం ఏర్పడిరదని వారు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వీరశేఖర్, డివిజన్ సహాయ కార్యదర్శి పి.సి.ఎం.రాజు, సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు పి.చాంద్ బాషా, సిపిఎం బద్వేల్ రూరల్ కమిటీ కార్యదర్శి డి.వెంకటేష్. సి.పి.ఐ. జిల్లా సమితి సభ్యులు పి.వి.రమణ, పట్టణ కార్యదర్శి బాలు, గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య, సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు ఇ.రమణ, గిలక రాజు, ఎస్ .మస్తాన్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని , డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు షరీఫ్, నాగార్జున చేతి వృత్తిదారుల నాయకులు పి.నాగరాజు. బిల్డింగ్ వర్కర్స్ నాయకులు రాయప్ప, తదితర సిపిఎం, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.