
బావూపేట రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు – కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్‌తో కలెక్టర్ స్పందన
Union Minister Bandi Sanjay Kumar expressed anger over knee-deep water stagnation on Bavoopet Road near Karimnagar, directly calling officials to initiate urgent repairs.
కరీంనగర్-సిరిసిల్ల మార్గంలో బావూపేట వద్ద మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిన దురవస్థపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుప్పకూలారు. అధికారిక పర్యటనలో భాగంగా సిరిసిల్ల వెళ్తుండగా రోడ్డుపై నీటిలో ఇరుక్కున్న వాహనాలు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను చూసి వెంటనే వాహనం ఆపారు. బాధితుల ఆవేదన విని—గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్న స్థానికుల మాటలు ఆయనను ఆగ్రహానికి గురిచేశాయి.
వర్షం పడిన ప్రతీసారి రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలుస్తోందనీ, ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. నిన్నటికే మూడు ఆటోలు బోల్తా పడ్డాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ తక్షణమే ఆర్ అండ్ బి అధికారులకు, అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కాల్ చేసి, రహదారి దుస్థితిపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించాలని, ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.