బాధ్యతలను స్వీకరించిన సోమేష్‌ కుమార్‌


హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత సోమేష్‌ కుమార్‌ కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు సోమేష్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *