వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు ఇస్తూ నిర్లక్షపు థెరపీతో ప్రాణాలకు ముప్పు తెస్తున్న తెస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది. కలర్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలి కుటుంబసభ్యులు. సికింద్రాబాద్ కార్ఖానాకి చెందిన మహేశ్వరి ( 30 ) అశోక్ దంపతులు..
నిరుపేద కుటుంబం.. భర్త అశోక్ ప్రైవేట్ ఉద్యోగి. 81 కేజీలు ఉండే..మహేశ్వరి..బరువు తగ్గేందుకు టీవీల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి ఆకర్షితురాలైన కార్ఖానా కలర్స్ లో ట్రీట్మెంట్ తీసుకుందని మహేశ్వరి తెలుపుతోంది . 15 KG లి తగ్గిస్తామని 40వేల ప్యాకేజికి కుదుర్చుకొని, అందులో భాగంగా ఈనెల 15 న 7000 రూపాయలు కట్టి జాయిన్ అయిన బాధితురాలు మహేశ్వరి. మొదటి రోజు మసాజ్..2 వ రోజు ఎలక్ట్రిక్ వైబ్రేట్ మెషిన్ తో ట్రీట్మెంట్ చేసిన సిబ్బంది. దీంతో ఆమెకు వాంతులుకాగా మాములేనాన్ని కలర్స్ వారు సర్ది చెప్పారని తెలుపుతోంది. ఈ నెల 21 న మరోసారి పిలిచి.. ఎలక్ట్రిక్ వైబ్రేట్ పెట్టిన సిబ్బంది. వాంతులు , కడుపులో నొప్పితో. కలర్స్ కార్యాలయంలోని వాష్ రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయానని, అయినా కలర్స్ యాజమాన్యం, సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తోటివారి సమాచారంతో..భర్త , బంధువులు మహేశ్వరి ని స్థానిక నవజీవన్ ఆసుపత్రికి తరలించారు. దీంతో భర్త, ఆమె సోదరి.. బంధువులు ఆందోళన. బరువు తగ్గిస్తామని ప్రాణాల మీదకు తెచ్చిన..కలర్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్. కార్ఖానా పోలీసులకు పిర్యాదు చేసిన బాధిత బంధువులు..!