బడా బాబులే టార్గెట్‌ గా ముఠా.. యూ ఎస్ ఏ లో ఐటి ఉద్యోగం మాని, మరి లక్షల్లో వసూలు..

హైదరాబాద్‌ : బాగా చదువుకున్నాడు… విదేశాల్లో మంచి ఉద్యోగం కూడా చేశాడు.. ఇక్కడి వరకు చాలా బాగుంది.. కానీ.. మెదడులో ఉన్న పురుగు మెసిలిందో ఏమో.. చేస్తున్న జాబ్‌ వదిలేసి.. హైదరాబాద్‌ వచ్చేశాడు. పెద్ద పెద్ద వారిని టార్గెట్‌గా చేసుకుని.. వాళ్ల లూప్‌ హోల్స్‌ తెలుసుకుంటూ.. బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. వక్ర మార్గంలో డబ్బులు సంపాధించటం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్‌ అనే యువకుడు బాగా చదువుకున్నాడు. యూఎస్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశాడు. జాబ్‌ చేయటం ఇష్టం లేకనో.. హాలీవుడ్‌ సినిమాల ప్రభావమో.. సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే యూఎస్‌ నుంచి నేరుగా హైదరాబాదుకు వచ్చాడు ప్రదీప్‌. మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ స్కూల్స్‌, బిజినెస్‌ మ్యాన్లు, గవర్నమెంట్‌ డాక్టర్లను టార్గెట్‌గా చేసుకొని వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు.ఈ ముఠా బిజినెస్‌ మ్యాన్‌ లూప్‌ హోల్స్‌ ఆధారంగా చేసుకుని బ్లాక్‌ మెయిల్‌ పాల్పడుతున్నారు. ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తూ వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసి వారి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఆ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వ్యాపారవేత్తలను, ప్రముఖ స్కూల్‌, గవర్నమెంట్‌ డాక్టర్లను టార్గెట్‌గా చేసుకొని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.యూఎస్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రదీప్‌, శ్రీకాంత్‌, రాజేష్‌ అనే మరో ఇద్దరు యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి నగరంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, గవర్నమెంట్‌ డాక్టర్లను టార్గెట్‌గా చేసుకుని వారి లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *