అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కరీంనగర్ ఎంపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. అయన లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసారు. అయన అరెస్ట్ ను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్‌ఎస్ నాయకత్వం పాలన చేతగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ మునిగిపోయే నావ… రాజకీయంగా బీఆర్‌ఎస్ సమాధి అయ్యేరోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు.