
Image: Screenshot from ‘ : https://www.google.com/search?q=Gold+Price+Today ” (used under fair use for reporting)
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ ఉధ్రిక్తతలు, పెట్టుబడిదారుల దృష్టి, పెళ్లిళ్ల సీజన్ ప్రభావంతో వచ్చే జనవరికి గోల్డ్ రేటు రూ.1.50 లక్షల మార్క్‌ను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold and silver prices have once again surged, with experts predicting that gold may cross the ₹1.50 lakh mark by January next year due to global tensions, increased investor interest, and seasonal wedding demand.
కొద్దిరోజులుగా వేగంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఈరోజు (బుధవారం) స్వల్ప విరామం తర్వాత మరోసారి పెరిగాయి. తాజా వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,28,890కు చేరింది. 22 క్యారట్ల బంగారం రూ.500 పెరిగి రూ.1,18,150 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు గోల్డ్‌పై 40 డాలర్లు పెరిగి ప్రస్తుతం 4,188 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు వెండి కిలో ధర రూ.1,000 పెరిగి రూ.2,07,000కు చేరింది.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, యుఎస్–చైనా వాణిజ్య ఉధ్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ షట్డౌన్పై ఉన్న అనిశ్చితి, ప్రపంచ మార్కెట్లో పెట్టుబడుల మార్పులు బంగారంపై డిమాండ్‌ను పెంచాయి. ఈ కారణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు కూడా భారీ గిరాకీ ఏర్పడింది. అంతేకాకుండా దేశీయంగా ధనత్రయోదశి, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడికి మరింత డిమాండ్ పెరుగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,18,150 కాగా, 24 క్యారట్ల ధర రూ.1,28,890గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,18,300, 24 క్యారట్ల బంగారం రూ.1,29,040గా నమోదైంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా సమాన రేట్లు ఉన్నాయి. వెండి ధర కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.2,07,000 వద్ద ఉంది.
Experts note that geopolitical tensions, the U.S.–China trade conflict, and uncertainty over the U.S. government shutdown have pushed investors toward gold, driving demand for Gold ETFs. Domestically, the upcoming Dhantrayodashi and wedding season are also adding momentum to prices. In major South Indian cities like Hyderabad, Vijayawada, and Visakhapatnam, 22-carat gold is priced at ₹1,18,150 per 10 grams, while 24-carat gold is at ₹1,28,890. Silver prices too have surged to ₹2,07,000 per kilogram in these regions.