
Gold Price Prediction: బంగారం ధరలు రికార్డు స్థాయికి – ఈ ఏడాది చివరినాటికి తులం రూ.2లక్షలేనా?
Gold Price Forecast: Will gold touch ₹2 lakh per tola by year-end? Experts predict sharp rise
బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్న రీతిలో పెరుగుతున్నాయి. 2005లో 24క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.7,000 వద్ద ఉండగా, ఇప్పుడు రూ.1,18,000 దాటింది. ఈ ఏడాది చివరినాటికి తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold prices are surging to record highs. From ₹7,000 per 10 grams in 2005, rates have now touched ₹1,18,000. Analysts project gold could reach ₹2 lakh per tola by the end of this year.
కరోనా తర్వాత ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది పసిడి ధర 50 శాతం, వెండి ధర 55 శాతం పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టులో గోల్డ్ ETF పెట్టుబడులు 36 శాతం పెరగడం గమనార్హం.
Since the pandemic, gold prices have witnessed an unstoppable rally. This year alone, gold surged 50% and silver 55%, with gold ETF investments jumping 36% in August.
మార్కెట్ నిపుణుల ప్రకారం, ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు, రూపాయి బలహీనత, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే 2026 మధ్య నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,000 డాలర్లను దాటే అవకాశం ఉందని, 3–4 ఏళ్లలో 5,000 డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Experts believe that Fed rate cuts, a weak rupee, and global economic uncertainty will drive further gold demand. They estimate gold could cross $4,000 per ounce by mid-2026 and possibly reach $5,000 within 3–4 years.
ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,900, కిలో వెండి రూ.1,39,600 వద్ద ఉంది. ఈ దూకుడు కొనసాగితే, వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలు మరో 15–20 శాతం పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Currently, Delhi gold prices stand at ₹1,18,900 per 10 grams and silver at ₹1,39,600 per kg. If the trend continues, prices may climb another 15–20% in the next year.