
బంగారం ధర భారీగా తగ్గింది. గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనుకూల సమయంగా బుధవారం ఉదయం మార్కెట్‌లో నమోదైంది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.660 తగ్గగా, 22 క్యారట్ల ధర రూ.600 తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు గోల్డ్ ధరలో 15 డాలర్ల తగ్గుదల కనిపించింది. దీంతో ఔన్సు గోల్డ్ ధర 3,295 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల బంగారం ధర రూ.90,000కు చేరింది. 24 క్యారట్ల బంగారం ధర రూ.98,180గా నమోదైంది. ఇదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర రూ.90,150 కాగా, 24 క్యారట్ల ధర రూ.98,330గా ఉంది. ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు నమోదు అయ్యాయి.
వెండి ధర విషయంలో స్వల్ప తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో వెండి ధర కిలోకు రూ.1,20,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,09,900 వద్ద ఉండగా, చెన్నైలో రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక: పై పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో రికార్డైనవి మాత్రమే. మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఇవి మారవచ్చు.