ఫ్యాక్సకాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్లోని కొంగరకలాన్ లో ఫ్యాక్సకాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీ లు మరియు కంపనీ ప్రతినిధి బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. రానున్న తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందిని మంత్రి అన్నారు. ఈరోజు ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుందిని అన్నారు. ఈరోజు కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందిన్నారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించెందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాంమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుందిని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందిని అన్నారు . తెలంగాణ ఫర్ క్యాపిట 2.5 రెట్లు పెరిగిందిదాదాపు 22,700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించామున్నారు. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. ఈరోజు భారతదేశం 30 సంవత్సరాల కింద చైనా ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉందిన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తే 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాముని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫ్యాక్సకాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *