
ఫిష్ వెంకట్ పార్థివదేహానికి సన్నిహితులు, ప్రజాప్రతినిధుల నుంచి నివాళులు
Fish Venkat’s death mourned; floral tributes offered by political leaders
సినీనటుడు ఫిష్ వెంకట్ మృతిపై సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. అడ్డగుట్టలో ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నివాళులర్పించారు.
సినీనటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌లు సికింద్రాబాద్ అడ్డగుట్టలోని వెంకట్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తలసాని మాట్లాడుతూ… వెంకట్ మంచి నటుడే కాకుండా సినీ పరిశ్రమలో అందరికి నాలుకలా ఉండేవాడని చెప్పారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన వెంకట్ మృతి విచారకరం అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరారు.