From February 25, examinations will begin with 9.9 lakh students expected to appear across the state.

ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. From February 25, examinations will begin with 9.9 lakh students expected to appear across the state.
మార్చి 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. మొత్తం 9.9 లక్షల హాల్ టికెట్లు జారీ చేయగా, విద్యార్థులు తమ తమ కాలేజీల ద్వారా వాటిని పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థుల హాల్ టికెట్లు కాలేజీ లాగిన్‌లలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
The Telangana Intermediate Board has released hall tickets for the March 2026 Intermediate Public Examinations. A total of 9.9 lakh hall tickets have been issued, and students can collect them through their respective colleges. Hall tickets for both first-year and second-year students are available in college login portals, officials said.
హాల్ టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్షా కేంద్ర వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. అలాగే, రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు SMS లింక్ పంపించి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు.
Students can check their examination centre details using the QR code printed on the hall ticket. Additionally, a download facility has been provided through an SMS link sent to the registered mobile number.
హాల్ టికెట్లలో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు తెలియజేసి సవరణ చేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానుండటంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Students were advised to report any discrepancies in the hall tickets to the board through their college principal for correction. With examinations commencing from February 25, officials urged students to complete all necessary preparations in advance.