
ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలి: సీఎం రేవంత్ | Private Doctors Should Serve One Month a Year in Govt Hospitals: CM Revanth
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సామాజిక బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలన్న సూచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.
Chief Minister A. Revanth Reddy urged doctors working in corporate hospitals to dedicate at least one month each year to serve the underprivileged in government hospitals. Speaking at the inauguration of AIG Hospital in Banjara Hills, he emphasized the need to build trust in public healthcare by offering quality services on par with private institutions.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకు సరైన వేదిక లేకపోవడంతో ప్రైవేట్ వైద్యులు సేవలందించలేకపోతున్నారని, అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫామ్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే నిపుణులు కూడా సేవలందించాలనుకుంటే వారికి ఆ అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
As there is no structured platform currently to integrate private sector doctors into public health services, the CM said such a system will be developed. He also noted that the government plans to facilitate overseas medical professionals to contribute during their visits to India.
ప్రభుత్వ వైద్య రంగ అభివృద్ధిపై ముఖ్యాంశాలు:
- ఉస్మానియా ఆసుపత్రికి ₹3,000 కోట్లు వ్యయంతో కొత్త భవనం
- డిసెంబర్ 9 నాటికి 7,000 పడకలతో ప్రభుత్వ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు
- నిమ్స్‌లో 2,000 పడకల విభాగం
- ఆరోగ్యశ్రీ పరిమితి ₹2 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంపు
- సీఎం సహాయనిధిగా ఇప్పటివరకు ₹1,400 కోట్లు ఖర్చు
- స్త్రీల హెల్త్ ప్రొఫైల్స్ కోసం యూనిక్ ID కార్డులు
- జపాన్‌లో నర్సింగ్ ప్రొఫెషన్ డిమాండ్ దృష్ట్యా జపనీస్ భాష శిక్షణ
The CM detailed ongoing health sector reforms including ₹3,000 crore Osmania hospital redevelopment, 7,000-bed hospital expansions across Hyderabad by December 9, a 2,000-bed NIMS block, increased Arogyasri coverage from ₹2 lakh to ₹10 lakh, and a push for health profiling and unique ID cards for SHG women. He also highlighted plans to teach Japanese language to nurses for global opportunities.
Private Doctors Should Serve One Month a Year in Govt Hospitals: CM Revanth
CM Revanth Urges Private Doctors to Serve One Month in Govt Hospitals Each Year