ప్రాజెక్టులపై అలసత్వంతో రైతులకు తీరని నష్టం భట్టి విక్రమార్క

అచ్చంపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా 83వ రోజు బుధవారం నాడు అచ్చంపేట మండలం ఎస్‌ ఎల్‌ బి సి టన్నల్‌ ను పరిశీలించారు. ఎస్‌ ఎల్‌ బి సి సొరంగ మార్గంలోకి క్రేన్‌ లో వెళ్లి జరుగిన పనులను పరిశీలించారు. జరిగిన పనుల వివరాలు సైట్‌ ఇన్చార్జి ఆర్పి సింగ్‌ ని అడిగి తెలుసుకున్నారు. తరువాత భట్టి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పాలమూరు, నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన ఎల్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పనులు చేపట్టకుండా బిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా నిర్లక్ష్యం చేసి రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది. గ్రావిటీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు ఇచ్చే విధంగా డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రెట్టింపు స్పీడుతో పూర్తి చేసుకోవాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫలితంగా పది సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పది సంవత్సరాల్లో మిగిలి ఉన్న పది కిలోవిూటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేయకుండా ప్రభుత్వం
దున్నపోతు నిద్రపోతున్నట్టుగా పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకుండా కావాలని కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టును పెండిరగ్లో పెట్టింది. టన్నెల్‌ బోర్‌ నాలుగు సంవత్సరాలుగా పనిచేయడం లేదని తెలిసిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2259 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల అంచనా వ్యయం 4776 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఈ ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎప్పుడో పూర్తయ్యేది. బిఆర్‌ఎస్‌ పాలకులకు ఉమ్మడి పాలమూరు నల్లగొండ జిల్లా ప్రజల పట్ల ప్రేమ, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించడం పెద్ద విషయమేవిూ కాదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నాలుగు లక్షల ఎకరాల భూముల్లో పంటలు పండి ఎకరానికి రైతులకు 20 వేల రూపాయల చొప్పున ఆదాయం వచ్చి ఉండేది. ప్రాజెక్టు పూర్తయిన ఐదు సంవత్సరాలు లోపే రైతులకు పంటల ద్వారా 5600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు కూడా తీరిపోయిఉండేదని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ మహబూబ్నగర్‌ జిల్లా రైతుల చేతుల్లో దాదాపుగా 10 వేల కోట్ల రూపాయలు టర్నోవర్‌ అవడం వల్ల వాళ్ల జీవన ప్రమాణస్థితులు మారేవని కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి తద్వారా ఆదాయం కూడా వచ్చేదని వివరించారు. కానీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వకపోవడంతో 9 సంవత్సరాలుగా 4 లక్షల ఎకరాల భూములు బీడుగానే మారి రైతుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఎస్‌ ఎల్‌ బి సి నుంచి నీళ్లు తీసుకుపోవాలని నల్లగొండ జిల్లా మంత్రి కైనా బుద్ధి ఉండాలి కదా? ఆ మంత్రి ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చి రివ్యూ చేసి నీళ్లు తీసుకుపోవాలన్న తపన ఉండాలి కదా? దిష్టిబొమ్మగా ఉంటే ఏం లాభం? పదేళ్ల నుంచి ఏం చేస్తున్నావ్‌? కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి బాధ్యతలు తీసుకోగానే ఎస్‌ ఎల్‌ సి వద్దకు వచ్చి అధికారులతో సవిూక్షలు నిర్వహించి చక చక పనులు చేయించారు. మంత్రి లాగా ఉండాలి కానీ, జిల్లాకు దిష్టిబొమ్మలా ఉండి కేసీఆర్కు భజన చేసుకుంటే సరిపోతుందా? మంత్రి పదవి అంటే ఇదేనా? ఎస్‌ఎల్బీసీ లాంటి ప్రాజెక్టులను నిరుపయోగంగా పెట్టడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని అన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *