
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ (వైద్యులు) జీతాలు పెంచాలి:
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిమాండ్
విశాఖపట్నం
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ లో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు తమ మౌన నిరసన తెలియజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరి మూడేళ్లు దాటిన 92,000 జీతానికే విధులు నిర్వహిస్తున్నామని, కాంట్రాక్టర్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో పలాస కిడ్నీ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు దాదాపు లక్ష 60,000 ఇస్తున్నారని అదే క్యాడర్ కు చెందిన తమకు మాత్రం 92000 ప్రభుత్వం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పీజీ స్టూడెంట్స్ టైఫండ్ మాకంటే ఎక్కువ వస్తుంది అని అన్నారు మూడేళ్లు దాటినప్పటికీ రెన్యువల్ చేయలేదని భవిష్యత్తులో పెంచిన జీతాలతో కాంట్రాక్టు రెన్యూ చేయాలని విమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోరారు కోరారు. అయితే కేవలం ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు మాత్రమే రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేస్తున్నామని 11 గంటలకు యధావిధిగా విధులు నిర్వహిస్తామని తెలియజేశారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మా ఆవేదనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్యశాఖ మంత్రులు అర్థం చేసుకొని తమకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరినట్లు విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు తెలిపారు.