ప్రపంచ మోస్ట్‌వాంటెడ్ డ్రగ్ డాన్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌లో హతమార్చింది.

Mexico’s most-wanted drug lord El Mencho was killed in a special military operation following an exchange of fire.

ప్రపంచ మోస్ట్‌వాంటెడ్ డ్రగ్ డాన్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌లో హతమార్చింది. Mexico’s most-wanted drug lord El Mencho was killed in a special military operation following an exchange of fire.

మెక్సికోలో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత నెమోసియో ఒసెగ్యురా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో హతమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 59 ఏళ్ల ఎల్ మెంచోను అదుపులోకి తీసుకునేందుకు మెక్సికో సైన్యం అతని స్వరాష్ట్రం హలిస్కోలోని తపాల్పా ప్రాంతంలో ఆదివారం భారీ ఆపరేషన్ చేపట్టింది.

Mexico’s authorities confirmed the death of Nemesio Oseguera Cervantes, alias El Mencho, leader of the Jalisco New Generation Cartel (CJNG). The 59-year-old kingpin was targeted in a large-scale operation conducted by the Mexican Army on Sunday in Tapalpa, Jalisco, his home state.

సైన్యం ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. ఎల్ మెంచో అనుచరులు ఎదురుకాల్పులకు దిగడంతో తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతన్ని గగనతల మార్గం ద్వారా మెక్సికో సిటీకి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే అతను మృతి చెందినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

The military cordoned off the area and conducted intensive searches. An exchange of fire broke out after cartel members opened fire on troops. El Mencho sustained critical injuries during the shootout. Though authorities attempted to airlift him to Mexico City for treatment, he died before reaching the capital, according to the Defense Ministry.

ఈ ఆపరేషన్‌కు అమెరికా నిఘా సంస్థల సహకారం అందినట్లు మెక్సికో రక్షణ మంత్రి తెలిపారు. ఎల్ మెంచోను పట్టుకునేందుకు అనేక సంవత్సరాలుగా గాలింపు కొనసాగుతున్నది. అతనిపై మాదకద్రవ్య రవాణా, హింసాత్మక నేరాలు, అంతర్జాతీయ నెట్‌వర్క్ నిర్వహణ వంటి ఆరోపణలు ఉన్నాయి.

Mexico’s Defense Minister stated that U.S. intelligence agencies assisted in the operation. El Mencho had been on the run for years and faced multiple allegations, including drug trafficking, violent crimes, and running an international criminal network.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర డ్రగ్ కింగ్‌పిన్‌గా పేరుగాంచిన ఎల్ మెంచో మృతి మెక్సికోలో నేర ప్రపంచానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అయితే, కార్టెల్ కార్యకలాపాలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది.

Considered one of the most dangerous drug traffickers globally, El Mencho’s death is seen as a major blow to organized crime in Mexico. However, the long-term impact on cartel operations remains to be seen.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *