ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్ మంగళవారం సవిూక్షించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని పర్యటన, తరువాత తరువాత పరేడ్ గ్రౌండ్ కు వెళ్లి ఈనెల 8న బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.