ప్రణీత.. క్యాజువల్‌ డ్రెస్లోనూ మెరుపులే..


టాలీవుడ్‌ గ్లామరస్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ వరుసగా తన ఫొటోషూట్స్తో అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. బావ చిత్రంతో ఈ కన్నడ సోయగం తెలుగు ఆడియెన్స్కు చాలా దగ్గరైంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో తన అందం అభినయంతో ఆడియెన్స్ను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్‌ నుంచి ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అలా స్టార్‌ హీరోల సరసన నటించి స్పెషల్‌ ఇమేజ్ను సొంతం చేసుకుంది. హీరోయిన్గా తక్కువ చిత్రాల్లోనే నటించినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మేద రభస బ్రహ్మోత్సవం హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాల్లో సెకండ్‌ హీరోయిన్గా అలరించింది. చివరిగా ఎన్టీఆర్‌ కథానాయకుడులోనూ మెరిసింది. ప్రస్తుతం కన్నడ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్గా ఉంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫొటోషూట్స్తో అదిరిపోయే అవుట్‌ ఫిట్లలో ఫ్యాన్స్తో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. సినిమాల అప్డేట్స్‌ ఎక్కువగా ఇవ్వకున్నా.. తన వ్యక్తిగత విషయాలను మాత్రం అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా క్యాజువల్‌ డ్రెస్లో కనిపించి మరోసారి యాత్‌ హృదయాలను కొల్లగొట్టింది. లైట్‌ గ్రీన్‌ ట్రాన్స్‌ ఫరెంట్‌ షర్ట్‌ వైట్‌ పాంట్లో కనిపించి ఆకట్టుకుంది. తన పోజులతో మతిపోగొట్టింది. ఇది చూసిన నెటిజ్లను క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కాగా కొంతకాలం క్రితం వివాహా బంధంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి ప్రెగ్నెన్సీ కారణంగా కాస్త బ్రేక్‌ వచ్చింది. 2021లో వ్యాపార వేత్త నితిన్‌ రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 జూన్‌ 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్‌ పొందింది. కానీ సోషల్మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులు అలరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *