ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ప్రధానపాత్ర పోషించే జర్నలిస్టులపై దాడులు అమానుషం…

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కృషి చేసే జర్నలిస్టులపై దాడులు అమానుషం

విలేకరులపై రాజకీయ పార్టీలు దాడులకు పాల్పడితే సహించేది లేదు

టీయుడబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు

విలేకరులకు రక్షణ కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి

జిల్లా బ్యూరో మేడ్చల్ మల్కాజ్గిరి : ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర పోషించే జర్నలిస్టులని అటువంటి జర్నలిస్టులను విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల సమయంలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్న విలేకరులపై దాడులకు పాల్పడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కలెక్టరేట్ లో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ… మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేటలోని సెలెబ్రిటీ క్లబ్ రిసార్ట్ లో ఎన్నికల నియమావలికి విరుద్ధంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరిపై బిఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడడం శోచనీయమన్నారు.తాజాగా మేడ్చల్ మండలంలో గౌడ వెళ్లి లో కూడా విలేకరులపై దాడులు జరగడం విచారకరమన్నారు.తరచుగా విలేకరులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా సమాచారాన్ని గోప్యంగా ఉంచవలసిన అధికారులు నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంలో అక్రమాలకు పాల్పడుతున్న వారి విషయాలను విలేకరులు అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వాటిని గోప్యంగా ఉంచవలసిన అవసరం ఎంతో ఉందన్నారు.కానీ సమాచారం అందించిన విలేకరుల వివరాలను అధికారులే అక్రమార్కులకు ఇస్తున్నారని ఆయన వాపోయారు.దీంతో విలేకరులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. వెంటనే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు తగిన సూచనలను చేస్తూ సర్క్యులర్ పంపించాలని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. శామీర్ పేటలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి నివేదికని ఇవ్వాలని ఆర్వో కు సూచించారు. సమాచార గోప్యత విషయంలో ఏమాత్రం పొరపాట్లు చేయవద్దని ఎన్నికల విధులలో ఉన్న అన్ని స్థాయిల సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ సర్క్యులర్ ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మ్యాప్సిల్ కమిటీ కన్వీనర్ దేశం కృష్ణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పండుగ రామకృష్ణ,పన్నాల బాల్ రెడ్డి,పాక రవీందర్, శామీర్ పేట ప్రెస్ క్లబ్ టియుడబ్లు(ఐజేయు) అధ్యక్షులు భూపాల్,టియుడబ్లుజె అధ్యక్షులు రమేష్,నాయకులు శేషారెడ్డి,రవీందర్ గౌడ్, భాధితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *