ప్రజావాణి దరఖాస్తులకు వేగవంతమైన పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలి — జిల్లా కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులకు వేగవంతమైన పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలి — జిల్లా కలెక్టర్ హైమావతి
District Collector Haimavati Directs Officials to Resolve Prajavani Petitions Promptly

ప్రజల నుండి వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 152 అర్జీలు అందాయి. కలెక్టర్ హైమావతి అదనపు లోకల్ బాడీస్ అధికారి గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల సమస్యలను స్వీకరించారు.

In Siddipet, during the Prajavani public grievances program held on Monday at the IDOC Conference Hall, District Collector K. Haimavati received 152 petitions from citizens. She emphasized that all departments must ensure timely redressal of grievances and upload the resolution status online by Saturday.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో పర్యటించి సానిటేషన్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వనమహోత్సవం, తదితర ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యంగా తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

The Collector also directed that Mandal Special Officers must conduct field visits every Tuesday and Friday to inspect key developmental programs including sanitation, Indiramma housing, and Vanamahotsavam activities.

ఈ సమావేశంలో డిఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఎ.వో., వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *