
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మహా గురుకులం ప్రారంభం – Collector Dr. Sridhar Cherukuri launches Ambedkar Maha Gurukulam near Brahmangarimatham
Quality education for underprivileged children begins with the launch of Ambedkar Maha Gurukulam by District Collector Dr. Sridhar Cherukuri near Brahmangarimatham.
బ్రహ్మంగారిమఠం సమీపంలో ఆధునిక వసతులతో నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ బాలుర మహా గురుకులం విద్యాలయం బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ విద్యాలయం మార్గం సుగమం చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
The newly constructed Dr. B.R. Ambedkar Maha Gurukulam for boys, near Brahmangarimatham, was inaugurated on Wednesday by District Collector Dr. Sridhar Cherukuri, Mydukur MLA Putta Sudhakar Yadav, and SP Ashok Kumar. The Collector stated that this school will pave the way for delivering quality education to underprivileged students.
ఈ విద్యా సంవత్సరానికి 640 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. గురుకులం వెయ్యి మంది విద్యార్థులకు వసతులు కల్పించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ విద్యా సంస్థ ఆధునిక తరగతి గదులు, వసతి గృహాలు, కిచెన్, కంప్యూటర్ ల్యాబ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలతో రూపొందించబడింది.
This academic year, the school has begun with admissions for 640 students, though it has the capacity to accommodate up to 1,000. The campus includes modern classrooms, hostels, a kitchen, and a computer lab.
కలెక్టర్ మాట్లాడుతూ విద్య అనే శక్తివంతమైన ఆయుధాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పూర్వీకుల విద్యా విలువలతో కూడిన గురుకుల వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
The Collector highlighted that empowering students through value-based education is the government’s key goal. He emphasized the importance of reviving traditional Gurukul systems that reflect India’s deep-rooted educational heritage.
ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 2016 నుంచే ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకుని రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టామని, తాజాగా మరో రూ.1.23 కోట్లతో రోడ్లు, ప్లే గ్రౌండ్, అందమైన ఆకృతిలో తీర్చిదిద్దిన వాతావరణం పూర్తి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ చొరవతో పెండింగ్ లో ఉన్న ఫర్నిచర్, కిచెన్ సామగ్రి, కంప్యూటర్లు రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
MLA Sudhakar Yadav explained that the project was initiated in 2016 with Rs. 21 crore and recently an additional Rs. 1.23 crore was spent on roads, playgrounds, and landscaping. He credited the Collector’s efforts for the quick procurement of pending infrastructure like furniture, kitchen equipment, and computers.
రానున్న విద్యా సంవత్సరాల్లో జిల్లాలోనే కాక రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో గురుకులం ముందుకు సాగుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు.
The Collector expressed hope that this institution will soon deliver top academic results not only at the district level but also across the state.