పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ దిశగా అనకాపల్లి జిల్లాలో కార్యాచరణ రూపకల్పన

పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ దిశగా అనకాపల్లి జిల్లాలో కార్యాచరణ రూపకల్పన

The Anakapalli district-level action plan meeting under Vision 2047 emphasized eradicating poverty through P4 (Public-Private-People Partnership), with Minister Kollu Ravindra stressing targeted development and economic upliftment strategies.

పేదరిక నిర్మూలన లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 భాగంగా అనకాపల్లి జిల్లాలో కీలక కార్యాచరణ సమావేశం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్యంగా పీ4 (ప్రభుత్వం-ప్రైవేట్-ప్రజల భాగస్వామ్యం) పై ప్రణాళికలు రూపొందించాయి.

ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి నియోజకవర్గాల స్థాయిలో ‘విజన్ డాక్యుమెంట్లు’ అవసరమని తెలిపారు. ప్రత్యేకంగా బంగారు కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేట్ భాగస్వాములతో ఆర్థిక ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని గుర్తించారు.

విశాఖ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 4 లక్షలైతే, అనకాపల్లిలో కేవలం రూ. 2 లక్షలుగా ఉందని, ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 64,518 బంగారు కుటుంబాలు గుర్తించగా, 1.7 వేలపైగా కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు.

విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో సాధన ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, ఈ లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎన్నారైల భాగస్వామ్యంతో పూర్వపు జన్మభూమి స్పూర్తిలో అభివృద్ధి సాధించాలన్నదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *