. Videos claiming 80% discount on pending traffic challans in Telangana are fake, clarified Hyderabad CP Sajjanar.

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీలు అందుబాటులో ఉన్నాయంటూ ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నెల 14న నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా 80 శాతం డిస్కౌంట్తో చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని కొందరు వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ V. C. Sajjanar స్పందించారు. తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ, ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీని ప్రకటించలేదని తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఉందని చెప్పడం పూర్తిగా ఫేక్ అని వెల్లడించారు.
According to the Commissioner, certain individuals are spreading misinformation to gain views and popularity on social media. He clarified that no official announcement has been made by the police department regarding any discount on traffic challans during the National Lok Adalat on March 14.
ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
He warned that strict legal action will be taken against those creating and circulating false information to mislead the public.