ప్రధాన పురోహితులు నివర్తి శ్రీరామ్ మూర్తి తోపాటు పురోహితులు భార్గవ్, ముఖ్యంగా ముషీరాబాద్ టిఆర్ఎస్ నాయకులు శివ ముదిరాజ్ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు.

.
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ముషీరాబాద్ చౌరస్తాలోని పురాతన ప్రసిద్ధ రామాలయంలో శాసనసభ్యులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజ నిర్వహించారు.
ఈరోజు శ్రీరామనవమి పర్వదినం కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రామాలయాలు విశేష పూలాలంకరణ విద్యుత్ దీపాలతో వెలుగుతున్నాయి. అందులో భాగంగానే ముషీరాబాద్ చౌరస్తాలోని పురాతన ప్రసిద్ధ రామాలయం లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను రామాలయానికి అనుకొని ఉన్న ముషీరాబాద్ చౌరస్తా లోనే అతిపెద్ద శ్రీ రాములవారికి పెళ్లి పందిరిని వేసి అత్యంత ఘనంగా వైభవంగా శ్రీ రాములవారి కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ముశ్రమ చౌరస్తా లోని రామాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది ఈ రామాలయం సుమారుగా 70 సంవత్సరాలకు పైగా భక్తులచే పూజలు అందుకుంటుంది
.

ఈ రామాలయాన్ని అప్పట్లో ఇక్కడ ఏదో కోనేరు ఉండేదని అందులో రాముడు విగ్రహాలు లభించాయని నానుడి, దీంతో ఓ ధాత ముష్రవ చౌరస్తాలోని సుమారు 2000 గజాల స్థలాన్ని స్వామివారికి అప్పట్లోనే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఏ రామాలయంలో వెళ్లిన రాములవారు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయస్వామి మాత్రమే ఉంటారు అయితే ఈ ముషీరాబాద్ చౌరస్తాలో ఉన్న రామాలయంలో రాములవారు సీతమ్మ తో పాటుగా లక్ష్మణుడు సతీమణి ఊర్మిలతో కలిసిన ఉన్న వైవిద్యమైన రాతి విగ్రహాలు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాయి. అందుకే ముషీరాబాద్ చౌరస్తాలోని రామాలయానికి ఎంతో ప్రతీది ప్రఖ్యాతి ఉందని ఫేనోళ్ల చెప్పుకుంటూ ఉంటారు.