పుట్టిల్లు పొమ్మంది.. కూతురు కవితను సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌..KCR suspend

పుట్టిల్లు పొమ్మంది.. కూతురు కవితను సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌
KCR suspends daughter Kavitha, says party discipline above family ties

హైదరాబాద్ / Hyderabad
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై కవితను బిఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన నిర్ణయంపై కీలక చర్చలు వెలుగులోకి వచ్చాయి. పార్టీని కంటే కుటుంబం ముఖ్యమని అనిపించకూడదన్న ఆలోచనతో కేసీఆర్‌ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

BRS chief KCR suspended his daughter Kavitha for alleged anti-party activities, a move that has triggered wide political discussion in Telangana. According to party sources, KCR conveyed to senior leaders that the party’s interests stand above personal or family considerations.

పార్టీ లోపలి సమాచారం ప్రకారం, కవితకు తాను ఏం తక్కువ చేయలేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసే అవకాశం, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి, మద్యం కేసులో లాయర్లకు భారీ ఖర్చు పెట్టిన విషయాలను ఆయన గుర్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ కవిత కాంగ్రెస్‌ పట్ల సహకార వైఖరి ప్రదర్శించడం, సీఎం రేవంత్‌ ఫోల్డర్‌లో పనిచేస్తున్నట్లు ఆధారాలు చూపించారని నాయకులు సూచించారు.

Sources reveal KCR questioned Kavitha’s political stance despite the support she received within the party. Reports suggest that some leaders presented evidence indicating her proximity to CM Revanth Reddy’s camp. KCR is said to have even explored whether Kavitha might launch a new party or join Congress if suspended.

పార్టీ నేతలు కవితను సస్పెండ్‌ చేస్తే అది భవిష్యత్తులో ఇతరులకు హెచ్చరికగా ఉంటుందని సూచించారు. అలాగే కవిత కాంగ్రెస్‌లో చేరితే ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశముందని, అది బిఆర్ఎస్‌కే రాజకీయ లాభం అవుతుందని కేసీఆర్‌ అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కవితపై విమర్శలు చేసిన కొందరు నేతలు ఆమెను బహిష్కరిస్తేనే పార్టీకి మంచిదని స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు నేతల అభిప్రాయాలను విన్న కేసీఆర్‌ కవితపై వేటు వేయాలని నిర్ణయించారు.

Party insiders believe the suspension will act as a deterrent against further indiscipline. Some leaders told KCR that Kavitha joining Congress might even politically benefit BRS, while others openly said expelling her was the only way to protect the party. After hearing all views, KCR decided to suspend his daughter from BRS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *