Be alert upcoming April month may have15 holidays to Banks
వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే నెల ఏప్రిల్‌లో బ్యాంకులు దాదాపు సగం రోజులు పనిచేయడం లేదు. శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయి.
ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. అలాగే 4న మహవీర్ జయంతి, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 7న గుడ్‌ఫ్రైడే, 14న అంబేడ్కర్ జయంతి, 22న రంజాన్ నేపథ్యంలో తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే, ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. మహవీర్ జయంతి రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు లేదు. మరోవైపు రెండు, నాలుగో శనివారాలైన 8, 22వ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అలాగే వచ్చే నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇలా ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులు బ్యాంకులు పనిచేయబోవు. ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చేనెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.