పాతబస్తీలో వీధి కుక్కలు స్వైరవిహారం


హైదరాబాద్‌ : కంచన్‌ బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డిఆర్డీవో సవిూపంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేసి మూడు ఏళ్ల బాలుడి పై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికాస్‌ కుమార్‌ డీఆర్డీవో టౌన్‌ షిప్‌ సి టైప్‌ క్వార్టర్‌ లో ఉంటున్నాడు. అతని కుమారుడు అతర్వ వర్మ మూడు సంవత్సరాల బాలుడు గురువారం రాత్రి సమయంలో ఇంటికి వెళుతుండగా 5 వీధికుక్కలు కుక్కలు ఒకే సారి కలిసి బాలుడి పై దాడి చేసి కరవడం జరిగింది. బాలుడి తండ్రి జీహెచ్‌ఎంసి కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినాన కానీ.. రాత్రి పూట మేము ఏవిూ చేయలేమని చేతులెత్తేశారు. టౌన్‌ షిప్‌ లో కుక్కలు పెంచటం బాగానే ఉంది.. వాటిని అదుపులో ఉంచితే బాగుంటుందని , అడ్డు అదుపు లేకుండా కుక్కలు పెరుగుతూ ఉన్నాయని , వాటి పై చర్యలు తీసుకుని నియంత్రించాలని , లేదా మేము ఉద్యోగం వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిరదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *