
పాకిస్తాన్ యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా ఆయన పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్ షా .1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను ‘శ్యామ్ బహదూర్’ అని పిలుచుకుంటారు.ఒకేఒక్క వాక్యం.. లొంగిపోండి లేదా తుడిచి పెడతాం.. అంతే 93000 మంది యుద్ధ ఖైదీలు ప్రాణభీతితో లొంగిన చారిత్రాత్మక దృశ్యానికి దారితీసింది..1914 ఏప్రిల్ 3వ తేదీన అమృతసర్‌లోని పార్శీ దంపతులకు మానెక్‌షా నలుగురు అన్నలు ఇద్దరు అక్కల మధ్య ఐదవ వాడిగా జన్మించారు.ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్, పంజాబ్ రాష్ట్రంకు వలస వచ్చారు.1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 45,000 మంది పాక్‌సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది.న్యూమోనియాకు చికిత్స పొందుతూ, కొంత సహజమయిన వృద్దాప్యం వలన జూన్ 27, 2008 గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన యుద్ధ సేనాని జీవితంలో అలసిపోయి శాశ్వతంగా చుట్టూ ఉన్న కుటుంభ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారు. గొప్ప యోధుడిగానే 94 ఏళ్ల పరిపూర్ణ జీవనం సంతోషంగా గడిపారు.