పవన్ కళ్యాణ్ తాజా లుక్ వైరల్ – సినిమా షూటింగ్ మధ్య ‘ది 100’ ట్రైలర్ లాంచ్
Pawan Kalyan’s stylish photos go viral as he launches the trailer of ‘The 100’ in the middle of Ustaad Bhagat Singh shoot in Hyderabad.

ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ వర్చస్వం కొనసాగిస్తూనే సినీ ప్రాజెక్టులకు సమయం కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్.. శనివారం షూటింగ్ గ్యాప్‌లో నటుడు ఆర్‌కే సాగర నటించిన ది 100 సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మూవీ యూనిట్‌తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉస్తాద్ సినిమా డ్రెస్‌లో ట్రైలర్ లాంచ్‌కు హాజరైన పవన్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ప్రత్యేకంగా పవన్ స్టైలిష్‌గా కూర్చున్న ఫొటో, మరోవైపు పవన్ స్వాగ్‌తో నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే, ఈ నడిచే ఫొటో వకీల్ సాబ్ సినిమాను గుర్తు చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ దైన స్థైర్యంతో నడక, స్టైల్ అభిమానులను ఆకట్టుకుంది. పవన్ ఏ సినిమా లుక్ అయినా స్టైలిష్‌గా ఉండటం, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడం మామూలే కాదని నెటిజన్లు అంటున్నారు.