యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాఠశాలకు రావాలంటే భయపడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు బీబీనగర్ మండలం బట్టుగూడ గ్రామంలో పూజలు కలకలం లేపాయి. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులకు మరియు పిల్లలకు పాఠశాల ఎదురుగా జరిగిన పూజలను గమనించి భయభ్రాంతులకు గురై ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు. పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులకు విషయం తెలపడంతోటి పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని కొందరు ఫిర్యాదులు కూడా చేశారు..