
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడిరచుకు తింటోందని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. పేదలకు నిలువనీడ కూడా లేకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మూసాపేటలో చేపట్టిన 24 గంటల ఆత్మగౌరవ దీక్షాస్థలికి బండి సంజయ్ వచ్చి సంఫీుభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోతే రాష్ట్రాన్ని మాత్రం ఓ మూర్ఖుడు ఏలుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాడుతున్నందునే బీజేపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టి.. ప్రతిపేదవాడికి ఉచితంగా ఇస్తామని చెప్పారు.