
“పదేళ్లు నేనే సీఎం” వ్యాఖ్యలు కాంగ్రెస్ విలువలకు విరుద్ధం – రేవంత్ రెడ్డికి రాజగోపాల్ స్ట్రాంగ్ కౌంటర్
CM for 10 years? Rajgopal Reddy counters Revanth Reddy’s comments, says Congress doesn’t work like that
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన “2034 వరకూ నేనే సీఎం” వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నమైనా సహించబోమని హెచ్చరించారు.
Congress MLA Komatireddy Rajgopal Reddy has issued a strong rebuttal to Chief Minister Revanth Reddy’s recent statement at a public meeting in Palamuru where he said he would continue as CM till 2034. Rajgopal termed such comments as against the core principles of the Congress party.
పాలమూరు ప్రజా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “2034 వరకూ పాలమూరుబంధువైన నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను” అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.
రాజగోపాల్ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించినది — కాంగ్రెస్ పార్టీ వ్యక్తిపూజను ఎప్పుడూ ప్రోత్సహించదని. పార్టీ అధిష్ఠానం, ప్రజాస్వామ్య విలువలే కాంగ్రెస్‌ను నడిపించే మార్గదర్శకాలు అని చెప్పారు. “రాబోయే పదేళ్లు నేను సీఎం” అనడం కాంగ్రెస్ విధానాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు.
అలాగే, కాంగ్రెస్‌ను వ్యక్తిగత ఆధిపత్యంగా మార్చుకునే ప్రయత్నాలు పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు సహించరని హెచ్చరించారు. తెలంగాణలో వర్గవిభేదాలు మళ్లీ బహిర్గతమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.