ఈరోజు పదవ తరగతి పేపర్ కూడా లీక్ వార్తలు సంచలనంగా మారాయి. ఒకప్పటి అవిభక్త రంగ రెడ్డి జిల్లా ప్రస్తుత వికారాబాద్ జిల్లాలోని తాండూరులో పదవ తరగతి పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే పదవ తరగతి పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ ముందే లీక్ అయిందా? లేక పరీక్ష ప్రారంభమైన తర్వాతే బయటకొచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.