నూతనంగా లక్షమంది మత్స్యకారులకు సభ్యత్వాలు… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సిద్దిపేటలో నూతనంగా నిర్మించనున్న పశు వైద్య కళాశాలకు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, MP కొత్తా ప్రభాకర్ రెడ్డి శంఖుస్థాపన చేసారు. నూతనంగా ఏర్పడిన మత్స్య సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లు, నూతనంగా సభ్యత్వం పొందిన మత్స్యకారులకు గుర్తింపు కార్డులను మంత్రులు పంపిణీ చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 వ పశు వైద్య కళాశాల ను సిద్దిపేట లో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పెరిగిన జీవాల సంఖ్యకు అనుగుణంగా నూతన పశువైద్యులను తీర్చిదిద్దడం కోసమే పశు వైద్య కళాశాలల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. గొల్ల కురుమలకు 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనేనని మంత్రి గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *