దేశంలో నిస్సయ స్దితిలో ఉన్న పిల్లల పాలిట వరం వంటిది మిషన్ వాత్సల్య పథకమని అల్లూరి సీతారామ రాజు జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (సీఆర్పీఎఫ్) కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ అన్నారు,మండలంలోని లోతేరు పంచాయితీ శనివారం సంతలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సిఆర్పీఎఫ్) ఆధ్వర్యాన ఇటీవల ప్రవేశ పెట్టిన మిషన్ వాత్సల్య పధకంపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి కాని, తండ్రి కాని లేని,లేదా విడాకులు తీసుకున్న 18 సంవత్సర లోపు ఉన్న అనాద, నిర్భాగ్య పిల్లలను ఆదుకోవడానికి,వారి భవిష్యత్‌కు ఈ పధకం ద్వారా ఆర్థిక మేలు ఎంతో మేలు జరగనుందని అన్నారు,అనాథలు,నిస్సహాయ స్థితిలో ఉన్న బాలబాలికలకు ఆరోగ్యంతో పాటు ఆర్ధికభరోసా కల్పించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయక్తంగా మిషన్ వాత్సల్య పధకాన్ని నూతనంగా ప్రవేశపెట్టిందన్నారు.ఈ పధకం కింద అర్హులైన వారికి ప్రతినెలా రూ.4 వేలు అందజేయనున్నారు. ఈ పథకంలో చేరాలనుకొనేవారు గ్రావిూణ ప్రాంత వాసులకు వార్షికాదాయం 72 వేలు పట్టణ ప్రాంతల వాసులకు 96 వేలు మించరాదన్నారు.అర్హులైన బాలబాలికలు ఈ పథకానికి వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని గ్రామ స్దాయి నుంచి మండల స్దాయివరకు ఈ పథకం వల్ల బాలలకు ఉపయుక్తతపై సిఆర్పిఎఫ్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిదిగా హజరైన లోతేరు పంచాయితీ సర్పంచి గుబ్బాయి కళావతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పధకం నిర్బాగ్యులైన ప్రతి బాలబాలకు వర్తించే వాలంటీర్లు పనిచేయలన్నారు. ప్రతి ఇంటింటికి ఈ సమాచారం చేరేలాగ వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్ , ఆయాలు మరియు ఆశ వర్కర్లు కూడ మన వంతు బాద్యతగా మన పంచాయితీ వాసులకొరకు పనిచేయలన్నారు. అందరు సామాజిక స్పృహతో పౌరులంతా అబాగ్యులైన పిల్లలకు చేదోడు వాదోడుగా సమాచారం అందించాలన్నారు.దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 15లోగా సంబందిత కార్యలయలో సమర్పించలన్నారు. దగ్గరరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఐ సిడిఎస్ సిడిపిఒ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్ సర్పంచి గుబ్బాయి శ్రీరామ్ , వైస్ సర్పంచి, ఆశ వర్కర్లు అంగన్వాడి ఆయలు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.