పరువు నష్టం కేసు ఉత్తరువుల వల్ల గత నెలలో లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తుగ్లక్ లేన్ 12లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసారు, తాను ఇల్లు కాలి చేసి వెళ్ళేటప్పుడు తన వెంట సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ సైతం ఉన్నారు. కాగా రాహుల్ గాంధీ కొంత భావోద్వేగానికి లోనైనట్లుగా కనిపించారు. “నిజం మాట్లాడినందుకు తాను చెల్లించిన మూల్యం” అని మీడియాతో అన్నారు. భారత ప్రజలు నాకు 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని ఇచ్చారు, అందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇల్లు నా నుండి లాక్కుంది మాత్రం ఈ రోజుల్లో నిజం మాట్లాడినందుకేనా. నిజం మాట్లాడినందుకు నేను ఎంత మూల్యం చెల్లించుకోవడానికైనా సిద్ధమేనని రాహుల్ గాంధీ అన్నారు.