తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక నంది అవార్డుల (Nandi Awards) గతంలో ఇచ్చిన విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పోసాని.. శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఏపీ ఫైబర్‌నెట్ ప్రెస్ మీట్లో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ తదితరులు పాల్గొన్నారు. నంది అవార్డుల గురించి మీడియా అడిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. గతంలో ప్రకటించిన నంది అవార్డులు ఇవ్వాలా వద్దా.. కొత్తగా ఇవ్వాలా అనే విషయంలో తమకు ఎటూపాలుపోవటంలేదని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అందుకే ఈ విషయమై కొంత సమయం పడుతుందన్నారు. ఇదే సమయంలో గతంలో నంది అవార్డుల విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన పలు వివాదాలను ప్రస్తావించారు. ముక్యంగా ఇక్కడ నంది అవార్డులు ప్రతిభకు రావని.. పంచుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎక్కడైనా ఫ్రీగా షూటింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నం..
‘‘నంది అవార్డుల గురించి, ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం జగన్‌తో క్షుణ్ణంగా మాట్లాడటానికి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఈవారంలో ఆయనతో మేమందరం చర్చించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా ముక్యంగా మన తెలుగు సినీ పరిశ్రమకు చెందినవాళ్లు సినిమా తీస్తే 99 % ఉచితంగా షూటింగ్ చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని సీఎంని కోరబోతున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు షూటింగ్ నిమిత్తం వచ్చేటప్పుడు బస్ టికెట్లలో 50 శాతం రాయితీ, అవకాశం ఉంటె ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు ఉంటే అవి కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ జరిగేటప్పుడు ఫిర్యాదులు అందాయని పోలీస్ వ్యాన్ వచ్చి కెమెరా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం వంటి సమస్యలు తలెత్తకుండా ఒకే ఒక్క అనుమతితో ఏపీ ఎక్కడైనా షూటింగ్ చేసుకునేలా సరైన విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఇవన్నీ వాస్తవానికి సీఎం మాకు చెప్పారు.. మేం నోట్ చేసుకున్నాం. ఇవన్నీ వివరంగా ఆచరణలోకి రావడానికి ఉన్న ఆటంకాలను అధిగమించి అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతోందని పోసాని వెల్లడించారు.
నంది తన కాంపౌండ్‌లోకి రాలేదన్నారు…
మీడియా అడిగిన ప్రశ్నలను ఉందేశించి పోసాని మాట్లాడుతూ.. నంది అవార్డుల గురించి మీరంతా అడుగుతున్నారు కదా, వాస్తవానికి నేను తెలుగు సినీ పరిశ్రమలో బాయ్‌గా ఉన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాను. మీడియా ద్వారానే నేను చాలా తెలుసుకోగల్గాను, నంది అవార్డులను ప్రకటించడానికి ముందే ‘ఫలానా కాంపౌండ్‌కి రెండు కావాలి, మరో కాంపౌండ్‌కి రెండు పోవాలి, ఇంకో కాంపౌండ్‌కి మూడు వెళ్లాలి, సదరు డైరెక్టర్‌కి రెండు ఇస్తే, నాకు మూడు ఇవ్వాలి, మూడు ఇవ్వకపోతే నేను అలుగుతా నేను వెళ్లబోను, ఆ నంది తీసుకోను’.. ఇలాంటివి మనం చాలా చూశాం. నేనే రెండు సార్లు ఇదే విషయమై ఫైట్ చేశాను. పేర్లుతో సహా మీడియా ద్వారానే మొత్తం ఇండస్ట్రీకి తెలియజెప్పాను. దానికి పర్యావసానం ఏమైంది.. పోసాని కృష్ణమురళి అనేవాడికి నంది అవార్డు ఇవ్వకూడదని నిర్ణయించారు కదా. ‘గాయం’, ‘పవిత్రబంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘శివయ్య’, ‘ప్రేయసి రావే’, ‘ఆపరేషన్ ధుర్యోదన’.. అందుకే వీటిల్లో దేనికైనా నాకు నంది అవార్డు ఇచ్చారా?.. అయినా నేను అలగలేదు, అడగలేదు. నంది నా కాంపౌండ్‌లోకి రాలేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు వచ్చింది ‘కమ్మ’నందిలానే కనపడింది…
‘‘తాను రైటర్‌గా ఉన్నప్పుడే పేర్లు పెట్టి మరీ నంది అవార్డులపై విమర్శించాను. నన్ను తిట్టడం తప్పితే వాళ్లలో వాస్తవం పై రియలైజేషన్ కాలేదు. ఆ మధ్య ఎన్టీ రామారావుతో ‘టెంపర్’ సినిమాలో చేశా. నా ఖర్మకాలి నాకు నంది అవార్డు ఇచ్చారు.న్నారు. ఎందుకంటే అక్కడ ఇవ్వడానికి ఇక ఎవ్వరూ లేరు. మరో ఆప్షన్ లేకే నాకు ఇచ్చారు. అందుకే ఇచ్చిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవరి కాంపౌండ్లకు వెళ్లాల్సిన నందులు వాళ్ళకి వెళ్లిపోయాయి. అందువల్లే నా కాంపౌండ్‌లోకి వచ్చినది మాత్రం నేను కమ్మ అవార్డుగా భావించా. ఇది కమ్మనందిలానే కనపడింది నా కళ్లకు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ నంది అవార్డు నాకు వద్దు అని చెప్పా’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు పోసాని. జ్యూరీలో మొత్తం 12 మంది న్యాయనిర్ణేతలు ఉన్నారని.. వాళ్లలో 11 మంది కమ్మోళ్లుగా అని చుపుకొచ్చారు. అయితే తన ఉందేశంలో 12 మంది కమ్మోళ్లు ఉన్న కూడా తప్పేమీ లేదని కానీ, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ.. కులాలకు, మతాలకు అస్సలు సంబంధంలేని, అందుకే వాటికీ అతీతంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని అన్నారు.