ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరుగుతోంది. అనూహ్య స్థాయిలో జనాభా పెరగడం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు లాంటి కారణాలు పలు దేశాల్లో చుక్క నీరు కూడా దొరకని స్థితికి దిగజార్చాయి. వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ పలు దేశాలు వెనకబడుతున్నాయి. త్వరలోనే ప్రపంచమంతా నీటి కొరత సమస్య క్రమంగా విస్తరిస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అంతా వృథానే. చాలా విధాలుగా సమాజంపై ఈ సమస్య తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వరల్డ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన రిపోర్ట్ ప్రకారం…త్వరలోనే ప్రపంచం వాటర్ ఎమర్జెన్సీని ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే 25 దేశాల్లో ఈ పరిస్థితులు వచ్చేశాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. అంటే…ప్రపంచ జనాభాలో పావు వంతు మంది నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 400 కోట్ల మంది ప్రతి నెలా నీటి వనరులు లేక అవస్థలు పడుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2050 నాటికి ఈ కొరత 60%కి పెరిగే ప్రమాదముంది. ఈ ప్రభావం జీడీపీపైనా పడనుంది. 2050 నాటికి నీటి ఎద్దడి కారణంగా..ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో 31% మేర ప్రభావానికి గురి కానుంది. అంటే 70 లక్షల కోట్లు. భారత్, మెక్సికో, ఈజిప్ట్, టర్కీలో ఈ సమస్య తీవ్రంగా ఉండే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ప్రస్తుతానికి తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశాలలో బహ్రెయిన్, సిప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ఉన్నాయి. ఈ దేశాల్లో కరవు ముంచుకొచ్చే ప్రమాదముంది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో నీటి ఎద్దడి మరీ తీవ్రంగా ఉంది. అక్కడ దాదాపు 83% మంది ప్రజలు నీటి కొరతతో సతమతం అవుతున్నారు. సౌత్ ఆసియాలో 74% మంది అవస్థలు పడుతున్నారు.’’ఈ భూగ్రహంపై అత్యంత కీలకమై వనరు నీరు. కానీ మనం మాత్రం వాటిని జాగ్రత్తగా వాడుకోవడం లేదు. దాదాపు 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి. వాతావరణం మారుతోంది. అదే నీటి ఎద్దడి రూపంలో మన ముందు సవాలుగా నిలుచుంది. పదేళ్లలో ఏ మాత్రం ఉపశమన చర్యలు తీసుకోలేదు. అంతటా ఇదే సమస్య. ఈ సవాలుని అధిగమించడం అత్యవసరం. రాజకీయ నేతలు కట్టుబడి ఉంటే ఇప్పటికైనా మనం మేల్కోవచ్చు. విలువైన నీటి వనరులను కాపాడుకోవాలి. కొన్ని సంస్థలూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇందుకోసం ప్రయత్నించాలి’’ఇటీవలే యునెస్కో ఓ విషయాన్ని వెల్లడిరచి భారతీయుల గుండెల్లో బాంబు పేల్చింది. మరో పాతికేళ్ల తర్వాత అంటే 2050 నాటికి భారతదేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కుంటుందని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్ మెంట్ అనే నివేదికలో తెలిపింది. ఐరాస2023 వాటర్ కాన్ఫరెన్స్‌కు ముందు విడుదల చేసిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2023లో నీటి కొరత విషయం వెల్లడైంది. ప్రపంచంలో నీటి సంక్షోభాన్ని నిరోధించడానికి బలమైన అంతర్జాతీయ యంత్రాంగాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే చెప్పారు. నీటి ఒత్తిడిలో నివసిస్తున్న వారిలో 80శాతం మంది ఆసియాలో నివసిస్తున్నారని చెప్పారు.ముఖ్యంగా, ఈశాన్య చైనా, అలాగే భారతదేశం, పాకిస్తాన్ దేశాల్లో నీటిఎద్దడి తప్పదని పేర్కొన్నారు. నీరు మన ఉమ్మడి భవిష్యత్తు. దానిని సమంగా పంచుకోవడానికి, స్థిరంగా నిర్వహించడానికి కలిసి పనిచేయడం చాలా అవసరం. ఈ సమస్యను పరిష్కరించుకోకుంటే కచ్చితంగా ప్రపంచ సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మందికి సురక్షితమైన తాగునీరు లేదని, 3.6 బిలియన్ల మందికి సురక్షితమైన పారిశుధ్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. ‘మానవాళికి జీవనాధారం నీరు అని, ప్రజల మనుగడకు ఇది చాలా ముఖ్యమైంది అని గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలనేది ముఖ్యమైన అడుగు అని చెప్పారు. మనం దీనిని పరిష్కరించకపోతే, ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభం ఏర్పడుతుంది అని హెచ్చరించారు. నీరు మానవాళికి జీవనాధారం. ఇది మనుగడకు చాలా ముఖ్యమైనది, ప్రజల ఆరోగ్యం, స్థితిస్థాపకత, అభివృద్ధి, శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది. మానవత్వం గుడ్డిగా ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది. పిశాచమైన అధిక వినియోగం, అధిక అభివృద్ధి, నిలకడలేని నీటి వినియోగం, కాలుష్యం, తనిఖీచేయని గ్లోబల్ వార్మింగ్ మానవాళి జీవనాధారాన్ని చుక్కల వారీగా హరిస్తున్నాయని ఈ నివేదిక మనకు గుర్తుచేస్తుందని గుటెర్రస్ చెప్పారు.ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీస పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడిరచింది. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా శుద్ధమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు అందాలని ఐరాస పెట్టుకొన్న లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్టు
2023లో పేర్కొన్నది. లక్ష్యాలను చేరుకొనేందుకు ఏడాదికి 600 బిలియన్ నుంచి ఒక ట్రిలియర్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ కాన్నర్ తెలిపారు. గత 40 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం ఏడాదికి దాదాపు ఒక శాతం వరకు పెరుగుతున్నదని పేర్కొన్నారు.ప్రపంచ పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతుండడంతో.. 2016నో దాదాపు 90 కోట్ల మంది ప్రజలు నీట సమస్యను ఎదుర్కున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వస్తుందట.ఇలాగే పెరుగుతూ వెళ్తే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుందని యునెస్కో అంచనా వేసింది. దీని వల్ల భారత్ తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని వెల్లడిరచింది.