హైదరాబాద్ : దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జయంతి పురస్కరించుకుని బుధవారం ఎస్.ఆర్. నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి డీజీపీ అంజనీ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తన బ్యాచ్‌మేట్ ఉమేష్ చంద్రతో ఉన్న అనుబంధాన్ని ఉమేష్ తండ్రితో కలిసి గుర్తు చేసుకున్నారు. తానూ, ఉమేష్ చంద్ర ఇద్దరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ ఎస్.పీ గా తమ కెరీర్ లను ప్రారంభించామని ఆయన తెలిపారు.